జగన్ ను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు

News
0

 


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. 
వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధినేతకు శాలువాలు కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛాలు అందించారు. కొందరు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకున్నారు. పలువురు జగన్ కు జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా వారితో జగన్ ముచ్చటించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ వైఖరిని వారికి వివరించారు. నిన్న సామాన్యులను కూడా తనను కలిసేందుకు అవకాశమిచ్చిన జగన్ ఇవాళ పార్టీ కార్యకర్తలను కూడా కలిశారు. వారితో సెల్ఫీలు దిగారు. వారితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">