హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన హీరో రాజ్ తరుణ్

News
0

 


సినీ నటుడు రాజ్ తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నటి లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదయింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె మొదటిసారి ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు లేవంటూ కేసు నమోదు చేయలేదు. రెండోసారి ఆధారాలు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను రాజ్ తరుణ్ కొట్టి పారేస్తున్నారు.
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">